Bandla Ganesh: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ బండ్ల గణేష్ అనతి కాలంలోనే నిర్మాతగా ఎదగటం తెలిసిందే. బిజినెస్ మాన్ గా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన బండ్ల తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారు. ఇండస్ట్రీలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ ఇంకా పలువురు హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. చాలా సినిమా వేడుకలలో మెగా కుటుంబాన్ని బండ్ల గణేష్ పొగడటం తెలిసిందే. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన దేవుడని ఎప్పుడూ చెబుతారు. ఇదే సమయంలో పవన్ అభిమానుల సైతం బండ్ల గణేష్ నీ ప్రత్యేకంగా అభిమానిస్తారు. ముఖ్యంగా ఆయన స్పీచ్ అంటే చెవులు కోసుకొని మరీ ఉంటారు.

అంతేకాదు పవన్ సినిమా వేడుక ఏదైనా జరుగుతుందంటే ఫ్యాన్స్ బండ్ల గణేష్ కి ఫోన్ చేసి వస్తున్నావా అన్న అని కూడా ఆరా తీస్తారు. అంతగా వాళ్ళ మధ్య బంధం ఉన్నదని ఇటీవల బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమానులపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ అభిమానులతో పంచాయతీ పెట్టుకున్నారు. “నన్ను కెలకొద్దు విశ్వరూపం చూపిస్తానని వార్నింగ్ లు ఇచ్చారు”. అసలు విషయం ఏమిటంటే ఇటీవల పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” షోకి రావటం తెలిసిందే. ఈ షోలో భాగంగా “గబ్బర్ సింగ్” సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో సినిమా నిర్మాత బండ్ల గణేష్ తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదు అని అర్థంలో ఓ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు.

ఈ సమాధానంతో తమ అభిమాన హీరోకి సరైన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా బండ్ల గణేష్ మోసం చేశారని ఫ్యాన్స్ టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో స్పందించి నేను నోరు తెరిస్తే గుండె ఆగిపోయి చేస్తావు నన్ను గెలకొద్దు అంటూ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు కౌంటర్లు ఇచ్చారు. ఈ పరిణామం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఏకధాటిగా పవన్ అభిమానులు.. బండ్ల గణేష్ నీ టార్గెట్ చేసుకునే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తీన్మార్.. ఫ్లాప్ అయితే వెంటనే గబ్బర్ సింగ్ పవన్ సొంతంగా నిర్మించుకోవలసిన సినిమా.. అయినా గాని దానికి బండ్ల గణేష్ కి అవకాశం ఇచ్చి మంచి హిట్ ఇచ్చారు. అయినా గణేష్ పూర్తిస్థాయిలో పారితోషకం ఇవ్వకపోవడం దారుణమని కృతజ్ఞతలు లేని వ్యక్తిని ఫ్యాన్స్ వేరే లెవెల్ లో కామెంట్ చేస్తున్నారు.