NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలియజేసిన బండ్ల గణేష్..!!

Advertisements
Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు మరొక పక్క సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను ఎదుర్కోవటానికి అన్ని రకాలుగా పవన్ రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమల టాప్ హీరోల ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ లు చేస్తూ సదరు సినిమాల నిర్మాతలు అభిమానులను అలరిస్తున్నారు. ఈ ట్రెండ్ మహేష్ బాబు పుట్టినరోజు నుండి స్టార్ట్ అయ్యింది. గత ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు “పోకిరి” సినిమా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోల చాలామంది సినిమాలు విడుదలయ్యాయి.

Advertisements

Bandla Ganesh gave good news to Pawan fans

పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఖుషి, గుడుంబా శంకర్, జల్సా, తొలిప్రేమ రీరిలీజ్ అయి… రికార్డు స్థాయిలో వసూలు రాబట్టాయి. ఈ ఏడాది పవన్ పుట్టినరోజు నాడు.. “గుడుంబా శంకర్” రీ రిలీజ్ చేస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించడం జరిగింది. అదే సమయంలో బండ్ల గణేష్ సైతం “గబ్బర్ సింగ్” రీ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో.. ఒకేసారి రెండు సినిమాలు ఒద్దని అభిమానులు కోరడంతో బండ్ల గణేష్ వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తీసిన “తీన్ మార్” సినిమా..రీ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేయగా దీనికి బండ్ల గణేష్.. సానుకూలంగా స్పందించారు.

Advertisements

Bandla Ganesh gave good news to Pawan fans

ఈ మేరకు..”తీన్ మార్” సినిమా బెస్ట్ క్వాలిటీ తో పాటు సౌండ్స్ ఇంకా డైలాగ్స్ కూడా క్వాలిటీగా వచ్చేలా..రీ రిలీజ్ చేస్తామని అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. అప్పట్లో విడుదలైన ఈ సినిమాకి డబ్బింగ్ బాలేదని నెగిటివ్ కామెంట్ రావడంతో పాటు పరాజయం పాలయ్యింది. జయంత్ సి పరాన్జీ తీసిన ఈ సినిమాలో.. పవన్ కళ్యాణ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. అప్పట్లో భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా నష్టాలు మిగులుతుంది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో ఎన్ని వసూలు రాపడుతుందో వేచి చూడాల్సి ఉంది.


Share
Advertisements

Related posts

రాజ్ కందుకూరి కుమారుడు శివ… మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం

Siva Prasad

Acharya : ఆచార్య.. నారప్ప సినిమాల మీద ఆప్రభావం పడితే బాధ్యులెవరు ..?

GRK

Devatha Serial: ఆదిత్య మంచి వాడని దేవికి చెప్పడం విన్న మాధవ్ ఏమన్నాడు..!?

bharani jella