“లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల రెండు చోట్ల నిర్వహించడం తెలిసిందే. తెలుగు “లైగర్” టైలర్ రిలీజ్ హైదరాబాద్ లో నిర్వహించగా హిందీ ట్రైలర్ రిలీజ్ ముంబైలో నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం జూలై 21 ఉదయం జరిగింది. అదే రోజు సాయంత్రం ముంబైలో జరిగింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో జరిగిన “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పోటెత్తారు. అయితే ఈ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.
“మా తండ్రి తెలియదు మా తాత తెలియదు అయినా కానీ మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి.. మాటలు రావడంలేదని” విజయ్ కొన్ని కామెంట్లు చేశారు. దీంతో విజయ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు అభిమానులు సీరియస్ అయ్యారు. కావాలని మా హీరోని ఉద్దేశించి విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. చాలా వరకు ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న వాళ్లు వారసులుగా వచ్చిన వాళ్లే. దీని ఉద్దేశించి విజయ్ దేవరకొండ “లైగర్” తెలుగు టైలర్ రిలీజ్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
అయితే ఈ వ్యాఖ్యల పట్ల తాజాగా బండ్ల గణేష్ కూడా పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే.. తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా, మహేష్ బాబుల, రామ్ చరణ్ లా .. ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ అని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో బండ్ల గణేష్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కచ్చితంగా విజయ్ దేవరకొండ కి బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ అని నెటిజన్ లు రియాక్ట్ అవుతున్నారు.