25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Bandla Ganesh: అల్లు బ్రదర్స్ పై సంచలన కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!!

Share

Bandla Ganesh: పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కమెడియన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమెడియన్ గా ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ అతి తక్కువ సమయంలోనే విజయవంతమైన కెరియర్ తో దూసుకుపోయాడు. ఒకపక్క కమెడియన్ గా మరో పక్క నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించడం జరిగింది. ఆ తర్వాత పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా రాణించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ అల్లు బ్రదర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Bandla Ganesh sensational comments on allu brothers
Bandla Ganesh

ఓ ఫంక్షన్ లో పాల్గొన్న బండ్ల గణేష్… అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ(వెంకటేష్) తో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఓ వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తండ్రి మాట వింటే బాబీలా అవుతారు… వినకపోతే బన్నీ స్టార్ హీరో అవుతారు..అని కామెంట్ పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో తండ్రి అల్లు అరవింద్ మాదిరిగానే నిర్మాతగా విజయవంతంగా బాబీ(వెంకటేష్).. ప్రస్తుతం రాణిస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Bandla Ganesh sensational comments on allu brothers
Bandla Ganesh

“పుష్ప” తో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం “పుష్ప 2” కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో బన్నీ అప్పట్లో ఇద్దరమ్మాయిలతో సినిమా చేశారు. ఈ క్రమంలో అల్లు బ్రదర్స్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Share

Related posts

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా – పెద్ద పెద్ద హీరో లు కూడా పనికిరారు

Ram

Mahesh Babu: మ‌హేశ్‌కే ఎందుకిలా జ‌రుగుతుంది..? ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం!

kavya N

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో అల్లు శిరీష్‌

Siva Prasad