Chor Bazzar: ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విశ్వక్ సేన్, సుబ్బరాజు, “సర్కారు వారి పాట” డైరెక్టర్ పరుశురాం తో పాటు బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పీచ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి భార్య వదిన లావణ్య నాకు తల్లితో సమానమని అన్నారు. సీతాదేవిని చూడలేదు గానీ అటువంటి మహాతల్లి లావణ్య గారు అంటూ చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ దగ్గర ఏమీ లేనప్పుడు వదిన లావణ్య రావటం జరిగిందని.. తర్వాత పూరి స్టార్ మారిపోయిందని తెలిపారు.
ఇంకా ఆకాష్ పూరి గురించి మాట్లాడుతూ.. అతనిలో మంచి టాలెంట్ ఉంది అని ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్టార్ అవుతాడు అని తెలిపారు. ఇండస్ట్రీలో డైలాగులు రానివారికి డాన్స్ వెయ్యని వారిని…ఎవరెవరినో పూరి స్టార్ లు చేశాడు. కానీ కొడుకు ఆకాష్ పూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన రాకపోవటం అన్యాయమని తెలిపారు. నాలాంటి వాడిని స్టార్ ప్రొడ్యూసర్ చేసి అద్భుతమైన యాక్టర్…. నీ కొడుకునీ స్టార్ నీ చేయకుండా బాంబేలో ఉండటం ఒప్పుకోము అన్న అంటూ తనదైన శైలిలో స్పీచ్ బండ్ల గణేష్ ఇచ్చారు. కచ్చితంగా “చోర్ బజార్” సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. పూరి జగన్నాథ్ ఏదో ఒకరోజు ఆకాష్ పూరి డేట్స్ అడిగే రోజులు వస్తాయి. ఆకాష్ పూరికి మంచి భవిష్యత్ ఉందని బండ్ల గణేష్ తెలియజేశారు. ఈ సినిమా ఖచ్చితంగా వదినమ్మ గురించి అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది.
నేను ఈ ఫంక్షన్ కి రాకముందు పూరి జగన్నాథ్ వల్ల స్టార్ అయినా హీరోలు అందరూ వస్తారని భావించాను. ఆకాష్ పూరి కి సపోర్ట్ చేస్తారు అని అనుకున్నాను. సినిమా ఇండస్ట్రీ కదా మామూలే ఎవరు రాలేదు. ఎందుకంటే పూరి కొడుకు.. రేపు పొద్దున స్టార్ అయితే మనకి ఇబ్బంది. పైకి రానివ్వకూడదు. ఏది ఏమైనా ఆకాష్ పూరి నీ ఇండస్ట్రీ లో ఎవరు ఆపలేరు. వాడి తల రాత అలా ఉంది కచ్చితంగా అవుతాడు. ఆకాష్ పూరి వాళ్ళ అమ్మ మా వదినమ్మ కన్న కలలు నిజమవుతాయి కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అంటూ తనదైన శైలిలో బండ్ల గణేష్ స్పీచ్ ఇచ్చాడు.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…