రికార్డులు తిరగరాసే సినిమా అంటూ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ వైరల్ కామెంట్..!!

Share

పవన్ క్రేజ్ గురుంచి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పది ఏళ్ళు హిట్ లేకపోయినా…మూడు సంవత్సరాలు ఏ సినిమా చేయకపోయినా పవన్ టాప్ హీరోగానే ఇండస్ట్రీలో రాణించడం జరిగింది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మరియు భక్తుడు బండ్ల గణేష్. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా గాని బండ్ల గణేష్..పవన్ ఫ్యాన్స్ కి చాల స్పెషల్. ఆయన స్పీచ్ అనేసరికి పవన్ అభిమానులు తెగ ఇష్టపడుతుంటారు. ఒకానొక టైములో  పవన్ కళ్యాణ్ నా దైవం.. ఒక్కసారి ఆయనకు వ్యసనం అయితే చాలు వదిలించుకోవడం కష్టం..అంటూ బండ్ల గణేష్ అభిమానులను అలరించే రీతిలో స్పీచ్ ఇస్తూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేష్ ని చాలా ప్రత్యేకంగా అభిమానిస్తారు. జీవితంలో తన విషయంలో కొన్ని సందర్భాలలో బలంగా నిలబడిన వ్యక్తి బండ్ల గణేష్ అని పవన్ ఒకానొక టైంలో తెలియజేశారు. ప్రస్తుతం కమెడియన్ గా మరియు పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేతగా బండ్ల గణేష్… ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. తన బ్యానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. అంతకుముందు “తీన్మార్” సినిమా చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ .. పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుతూ ట్విట్టర్లో సంచలన పోస్ట్ పెట్టారు. “నా దైవ సమానులైన.. మా పవన్ కళ్యాణ్ మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అని ట్వీట్ చేశారు. ఈ కామెంట్ తో పాటు గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఒకపక్క గన్ పట్టుకొని మరోపక్క టీ తాగే ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ఇంత అర్ధాంతరంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుతూ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

11 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago