Bandla Ganesh: మరో రెండు వారాలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉన్నాయి. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం జరిగింది. అక్కడ పోటీకి వచ్చిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించింది.
దీంతో తెలంగాణలో జరగబోతున్న ఎన్నికలను జాతీయ కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా సోనియాగాంధీ చాలామంది కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ సృష్టించబోయే సునామీలు అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ అయ్యప్ప మాల దీక్షలో ఉన్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ దీపావళి పండుగ నాడు ఓ పెద్ద తప్పు చేశారు. విషయంలోకి వెళ్తే ప్రతి ఏడాది దీపావళికి ఇంట్లో భారీ ఎత్తున పండుగ జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఆ రకంగానే టపాకాయలు కాల్చారు. అయితే అయ్యప్ప మాల దీక్షలో ఉండి బండ్ల గణేష్ చెప్పులు ధరించి టపాకాయలు కాల్చాడు. దేనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావటంతో నటిజెన్లు మండిపడుతున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండి అలా చేయటం ఏంటని ఏకిపారేస్తున్నారు.