Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం `బంగార్రాజు`. 2016లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీని అన్నపూర్ణా సినీ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని.. ఫస్ట్ వీక్‌లో అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. కానీ, ఆ తర్వాత ఉన్న పరిస్థితుల కారణంగా బాక్సాఫీస్ వద్ద డల్ అయిపోయింది.
ఇక తాజాగా ఈ మూవీ 25 రోజులను పూర్తి చేసుకోగా.. 25 వ రోజు 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. మరి ఇన్ని రోజుల్లో బంగార్రాజు బ్రేక్ ఈవెన్ అయిందా..? లేదా..? అక్కినేని సోగ్గాళ్లు హిట్ కొట్టారా లేదా అన్నది చూసేయండి.
వరల్డ్ వైడ్ బంగార్రాజు 25 డేస్ టోటల్ కలెక్షన్స్:
నైజాం- 8.39 కోట్లు
సీడెడ్- 7.00 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.31 కోట్లు
తూర్పు గోదావరి- 4.20 కోట్లు
పశ్చిమ గోదావరి- 2.92 కోట్లు
గుంటూరు- 3.48 కోట్లు
కృష్ణ- 2.28 కోట్లు
నెల్లూరు- 1.76 కోట్లు
————————————————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం- 35.34కోట్లు(57.68కోట్లు~ గ్రాస్)
————————————————————————–
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.83 కోట్లు
ఓవర్సీస్ – 1.51 కోట్లు
—————————————————————————–
వరల్డ్ వైట్ టోటల్ కలెక్షన్- 38.68కోట్లు(65.10కోట్లు~ గ్రాస్)
—————————————————————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ చేసిన బంగార్రాజు.. రూ. 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 25 రోజుల తర్వాత కూడా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా రూ.32 లక్షల దూరంలోనే ఉండిపోయిందీ చిత్రం.