Bangarraju movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి పండగా కానుకగా జనవరి 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
పెద్ద బంగార్రాజుగా నాగార్జున, చిన్న బంగార్రాజుగా నాగచైతన్యలు తమదైన నటన, లుక్స్, మానరిజమ్స్‌తో అదరగొట్టేశారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనిపించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకుని సెకెండ్ వీక్‌లో అడుగు పెట్టింది. కానీ, రెండో వారానికే బంగార్రాజు బాగా వీకైపోయినట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి వరల్డ్ వైడ్‌గా రూ. 38.15 కోట్లు బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 39 కోట్ల టార్గెట్‌తో సంక్రాంతి బరిలోకి దూకింది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రూ.33.45 కోట్లను రాబట్టేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ, ఈ చిత్రానికి ఇప్పుడు కలెక్షన్స్ బాగా డల్ అయిపోయాయి. ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 51 లక్షల షేర్, రూ. 80 లక్షల గ్రాస్ మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సూపర్ హిట్ అవ్వాలంటే నాగార్జున, చైతులు ఇంకా రూ. 5.55 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంది. మరి రెండో వారంలో బంగార్రాజు పుంచుకుని బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ఇక బంగార్రాజు ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం- 7.62 కోట్లు
సీడెడ్- 5.93 కోట్లు
ఉత్తరాంధ్ర- 4.37 కోట్లు
తూర్పు గోదావరి- 3.53 కోట్లు
పశ్చిమ గోదావరి- 2.54 కోట్లు
గుంటూరు- 3.03 కోట్లు
కృష్ణ- 1.94 కోట్లు
నెల్లూరు- 1.52 కోట్లు
———————————————————–
ఏపీ+తెలంగాణ- 30.48కోట్లు(49.30కోట్లు~ గ్రాస్)
————————————————————
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.62 కోట్లు
ఓవర్సీస్ – 1.35కోట్లు
————————————————————————————
ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 33.45కోట్లు(56కోట్లు~ గ్రాస్)
————————————————————————————