బండ్ల‌గ‌ణేష్ అరెస్ట్‌


సినీ న‌టుడు,నిర్మాత బండ్ల‌గ‌ణేష్‌ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫైనాన్సియ‌ర్ పీవీపీని ఇచ్చిన ఫిర్యాదు నేప‌థ్యంలో నోటీసులు స్వీక‌రించేందుకు ఆయ‌న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చారు. అదే స‌మ‌యంలో క‌డ‌ప కోర్టులో ఆయ‌న‌పై ఉన్న నాన్ బెయిల‌బుల్ వారెంట్ నేప‌థ్యంలో జంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో మ‌హేశ్ అనే వ్యాపారి ద‌గ్గ‌ర బండ్ల గ‌ణేష్ రూ.10 ల‌క్షలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. కోర్టుకి హాజ‌రు కానీ నేప‌థ్యంలో క‌డ‌ప కోర్టు ఆయ‌న‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఆయ‌న్ని కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.