Beast: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరుంది. ముఖ్యంగా సినిమాను సెలెక్ట్ చేయడంలో.. సినిమా విజయం సాధిస్తుందా లేదా ముందుగానే చెప్పటంలో.. దిల్ రాజు చాలా స్పెషలిస్ట్ అని ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ ఎప్పటి నుండో ఉంది. అటువంటి దిల్ రాజు చాలా వరకు నిర్మాతగా ఎక్కువగా కుటుంబ కథా ప్రేక్షకులను స్టార్టింగ్ లో నిర్మించగా మెల్ల మెల్లగా.. కమర్షియల్ సినిమాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తూ ఇప్పుడు పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క సౌత్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దిల్ రాజు రాణిస్తున్నారు. అటువంటి దిల్ రాజు తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ నటించిన “బీస్ట్” సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన రోజే అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా గ్యారెంటీ హిట్ అవుతుందని దిల్ రాజు భారీ ఎత్తున డబ్బులు పెట్టినట్లు.. అందువల్లే డైరెక్టర్ మరియు హీరో హీరోయిన్ పూజ హెగ్డే తో ఇంటర్వ్యూ కూడా దిల్ రాజు తీసుకున్నట్లు సమాచారం.కానీ ఇప్పుడు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో.. దిల్ రాజు భారీగా నష్టపోయినట్లు.. వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నా ఇటువంటి సమయంలో.. కచ్చితంగా ఇది దిల్ రాజు కి భారీ దెబ్బ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బీస్ట్ సినిమాని భారీ ధరకు దిల్ రాజు కొన్నట్లు.. ఇప్పుడు ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!