Beast: కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన చిత్రం `బీస్ట్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదలైంది.
కొందరు తీవ్రవాదులు చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను హైజాక్ చేస్తారు. అయితే అదే మాల్ ఉన్న మాజీ రా ఏజెంట్ వీర రాఘవన్ తీవ్రవాదుల నుంచి ప్రజలను ఎలా రక్షించాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథ. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ, విజయ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ పై అలరించలేకపోయిన సినిమాలు.. ఓటీటీ వేదికగా సక్సెస్ అవుతున్నాయి. దీంతో టాక్ తేడా కొట్టిన సినిమాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసేసి అఫీషియల్‌గా కూడా ప్రకటించారు.
బీస్ట్ సినిమా రెండు ఓటీటీల్లో అలరించబోతోంది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బీస్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. కాబట్టి, థియేటర్స్‌లో బీస్ట్ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా వచ్చే బుధవారం నుంచి ఓటీటీ వేదికగా వీక్షించవచ్చు.