Beast: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `బీస్ట్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 13న తమిళ్, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
బీస్ట్ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేమీ ఉండదు. సినిమా స్లోరీ చాలా వరకూ షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను తీవ్రవాదులు హైజాక్ చేయగా.. వారి బారి నుంచి రా ఏజెంట్ అయిన వీర రాఘవన్ ప్రజలను ఎలా రక్షించాడు అన్నదే ఈ సినిమా. టాక్ ఎలా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకుపోతోంది.
విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న చిత్రంగా బీస్ట్ సంచలనం సృష్టించింది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు మళ్లీ కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీస్ట్ ఓటీటీ రిలీజ్‌పై ఓ మాసివ్ అప్డేట్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఈ సినిమా మే రెండో వారంలో ఓటీటీలో సందడి చేయబోతోందట.ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్న విషయం విధితమే. అయితే ఈ ఓటీటీలోనే మే 13వ తేదీన బీస్ట్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.