NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR”తో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన “కొమరం భీమ్” పాత్రకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కడం తెలిసిందే. ఎన్టీఆర్ హావభావాలు.. ముఖ్యంగా కొమరం భీమ్ సాంగ్ లో… నటన.. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కి చాలామంది ఫిదా అయ్యారు. చరణ్ తో ఫస్ట్ టైం ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించడంతో ఇండస్ట్రీ ప్రముఖులు కూడా “RRR” విషయంలో ఎంతో గర్వ పడ్డారు. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా తర్వాత తారక్ నటించిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో తారక్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక మూవీ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తూ ఉన్నారు. కారణం చూస్తే కొరటాల మొదటి నుండి ఒక ఫ్లాప్ లేని డైరెక్టర్ గా మాత్రమే కాదు మాస్ నీ వెండితెరపై సరికొత్తగా చూపించే డైరెక్టర్. ఇప్పుడు అదే దర్శకుడు దర్శకత్వం లో వచ్చిన ఆచార్య దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. “ఆచార్య” స్టోరీ పెద్దగా లేకపోవడంతోపాటు అసలు కొరటాల మార్క్ ఎక్కడా కనిపించలేదని టాక్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ 30వ సినిమాకి కొరటాల ఏ విధంగా న్యాయం చేస్తాడో… అనే సందేహంలో తారక్ అభిమానులు ఉన్నట్లు టాక్.
గతంలో కొరటాల దర్శకత్వంలో నటించిన “జనతాగ్యారేజ్” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది. జూన్ నెలాఖరు నుండి ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం తారక్ ఏకంగా 5 కేజీలకు పైగా తగ్గే రీతిలో వర్క్ అవుట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ని చాలా డిఫరెంట్గా మాస్ ఎలిమెంట్స్ కథ కలిగిన స్టోరీ లో కొరటాల చూపించనునట్లు ఇండస్ట్రీ టాక్.