NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: 2024 ఎన్నికలకు ముందు బాలయ్య.. బోయపాటి కాంబినేషన్ లో మూవీ..?

Share

Balakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ తిరుగులేనిది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బాలయ్య కెరియర్ లోనే మూడు కూడా అత్యధికమైన వసూలు సాధించాయి. ఇదిలా ఉంటే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బోయపాటి..రామ్ తో సినిమా చేస్తున్నాడు.

Before 2024 elections Balayya Boyapati combination movie

ఇది కంప్లీట్ అయిన వెంటనే బాలకృష్ణ ప్రాజెక్ట్ పై కూర్చోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది “అఖండ” సినిమాకు సీక్వెల్ లేదా పొలిటికల్ నేపథ్యంలో వచ్చే స్క్రిప్ట్ అనీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా పండుగకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి ప్రాజెక్ట్ నీ సెట్స్ మీదకు తీసుకెల్లె ఆలోచనలో బాలయ్య ఉన్నారట.

Before 2024 elections Balayya Boyapati combination movie

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు లెజెండ్ విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అదే తరహాలో 2024 ఎన్నికలకు ముందు బాలయ్య సెంటిమెంట్ పరంగా బోయపాటితో సినిమా చేస్తున్నట్లు సమాచారం. చాలావరకు పొలిటికల్ సబ్జెక్టు తోనే సినిమా చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు టాక్. అతి తక్కువ టైంలోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ ఒక పక్క రాజకీయాలు… సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చారు రీతిలో.. సబ్జెక్టు ఉండలాగున జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లైన్ ఆ విధంగా సెట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. రామ్ తో బోయపాటి చేస్తున్న సినిమా ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరాకెక్కుతున్న సినిమా. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కార్యక్రమాలు కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య ప్రాజెక్టుపై బోయపాటి కూర్చోబోతున్నారట.


Share

Related posts

Kangana Ranaut: అందుకే నాకింకా పెళ్లి కావ‌డం లేదు.. కంగ‌నా ఆవేద‌న‌!

kavya N

Alia Bhatt- Ranbir Kapoor: అలియా-రణ్‌బీర్ వివాహానికి స‌ర్వం సిద్ధం.. గెస్ట్‌ల లిస్ట్ తెలిస్తే షాకే!

kavya N

Radhaku Neevera Pranam: డాక్టర్ బాబు సరికొత్త సీరియల్ రాధకు నీవేరా ప్రాణం.. ఎప్పటి నుంచంటే.?

bharani jella