Prabhas Maruthi: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మారుతి మాట్లాడుతూ “బుజ్జిగాడు”… “డార్లింగ్” తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్ కావాలంటే మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
ఈ పరిణామంతో ప్రభాస్ ప్రాజెక్టు కంటే ముందుగానే మరో హీరోతో సినిమా చేయడానికి డైరెక్టర్ మారుతి లేటెస్ట్ గా డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో “పక్కా కమర్షియల్” సినిమా చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రభాస్ తో చేసే సినిమా మొదలు పెట్టడానికి సంవత్సరాలు పట్టే టైం ఉండటంతో.. ఈ లోపు నాచురల్ స్టార్ నానితో కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయడానికి మారుతి డిసైడ్ అయినట్లు టాక్. గతంలో నాని వరుస ఫ్లాపులతో …డౌన్ ఫాల్ లో ఉన్న టైంలో “బలే బలే మగాడివోయ్” అనే సినిమా చేసి మర్చిపోలేని హిట్ మారుతి ఇవ్వటం జరిగింది.
దీంతో మరోసారి నానితో సినిమా చేయడానికి మారుతి డిసైడ్ అయినట్లు ఆల్ రెడీ స్క్రిప్ట్ కూడా వినిపించినట్లు… త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాని ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మారుతితో మరోసారి చేయడానికి కూడా నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్లు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…