మూడు పదుల వయస్సు కలిగి ఎంతో క్రేజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మహామహులకు పోటీ ఇచ్చిన నటుడు సుశాంత్ సింగ్ మరణ వార్త దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో చలాకీగా ఉంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా సఖ్యతతో మెలుగుతూ ఉండే సుశాంత్ ఏ కారణంతో చనిపోయి ఉంటాడు అన్నది ఇప్పటికీ కూడా పెద్ద సస్పెన్స్ గానే ఉంది.
అయితే కొడుకు చనిపోవడంతో సుశాంత్ తండ్రి బీహార్ రాష్ట్రంలో పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక పక్క బీహార్ పోలీసులు మరో పక్క ముంబైలో ఉన్న పోలీసులు కూడా ఈ కేసును చేధించే విషయంలో విచారణ చాలా సీరియస్ గా చేస్తున్నారు. కేసు తీవ్రత బట్టి చూస్తే త్వరలో ఈ కేసును న్యాయస్థానాలు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి అప్పగించే యోచనలో ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది.
పరిస్థితి ఇలా ఉండగా సుశాంత్ సింగ్ చనిపోయే ముందు గూగుల్ లో ఏమి సెర్చ్ చేశాడు అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడు అంశాల గురించి సుశాంత్ గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో వచ్చిన కొన్ని వార్తలతో పాటు మాజీ మేనేజర్ దిశా సాలిన్ పేరును, మెంటల్ హెల్త్ కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ని సుశాంత్ ఎక్కువగా సెర్చ్ చేశాడని, అంతేకాకుండా నొప్పి లేకుండా చనిపోవడం ఎలా వంటి విషయాల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో తేలింది.
ముఖ్యంగా తన మాజీ మేనేజర్ దిశా శాలిన్ చనిపోవటానికి కారణం విషయంలో తన పేరును జోడించడం పట్ల సుశాంత్ చాలా మనస్థాపానికి గురి అయ్యాడని…అందుకే ఆ సమయంలో ఎక్కువగా డిప్రెషన్ కి లోనయి వీటి గురించే సెర్చ్ చేసి ఉండవచ్చు అని ముంబై పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో… నొప్పి లేకుండా చనిపోవడం గురించి సుశాంత్ సెర్చ్ చేశాడా…? ఎంత బాధ మానసిక భాధ అనుభవించి ఉంటాడో అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.