Karnan Remake: రావు రమేష్ తెలుగు సినీ జగానికి పరిచయం అవసరం లేదు.. రావు గోపాలరావు వారసుడిగా తెలుగు సినీ తెరపై కనిపించినప్పటికీ కొన్ని సినిమాలతోనే రావు గోపాలరావు వారసుడిగా కాకుండా రావు రమేష్ గా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు… సైలెంట్ విలన్.., నెగిటివ్ షెడ్ పాత్రలు.. సహాయ పాత్రలు.. ఇలా ఏవైనా అవలీలగా పోషిస్తున్నారు. అటువంటి రావు రమేష్ కెరీర్ లో చిరకాలం నిలిచిపోయే పాత్ర ఒకటి అతని తలుపు తట్టినట్టు తెలుస్తుంది. ధనుష్ ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలై అత్యుత్తమ సినిమాగా నిలిచిపోయిన “కర్ణన్” తెలుగులోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ కథని తెలుగుదనానికి అనుగుణంగా మార్పులు చేసి దర్శకత్వం వహించనున్నారు. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు.. ఇక ఈ సినిమాలో హీరో పక్కన ఉంటూ సినిమా కథలో లీనమయ్యే అద్భుతమైన పాత్రకి రావు రమేష్ ని అనుకుంటున్నట్టు సమాచారం.
read more: ఆ మాటలే వల్లే నేను ఇక్కడ ఉన్నా: రావు రమేశ్
Karnan Remake: లాల్ జీవించారు..! మరి రమేష్..!?
మలయాళీ నటుడు లాల్ ఆ పాత్రలో జీవించారు. ప్రీ క్లైమాక్స్ లో తనకు తాను మంటలు అంటించుకుని మరణించిన పాత్రలో లాల్ ప్రాణం పెట్టి నటించారు. మొదటి నుండి సెంటిమెంట్, ఎమోషన్ ని బాగా పండించిన ఆ పాత్ర చివర్లో కన్నీరు పెట్టింస్తుంది. కర్ణన్ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమకే ఒక ఆణిముత్యం లాంటిది. అటువంటి సినిమాలో ధనుష్ తర్వాత ప్రముఖమైనది లాల్ పాత్ర. తెలుగులో సాయిశ్రీనివాస్ పక్కన రావు రమేష్ అయితే బాగుంటుందని శ్రీకాంత్ అడ్డాల అనుకుంటున్నారట. తన సినిమాల్లో రావు రమేష్ ని అద్భుతంగా వాడుకోవడం కూడా అతనికి తెలుసు. అందుకే దాదాపు ఆయన ఖరారైనట్టే. ఇక ఈ సినిమా సెప్టెంబరులో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ నాటికి పూర్తి చేసి.., జనవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.. మొత్తం ఒక ఊరు నేపథ్యం కావడం, రీమేక్ కావడంతో షూటింగ్ త్వరగానే పూర్తి చేయొచ్చనేది యూనిట్ ఆలోచన..!