Pawan kalyan -Vakeel Saab: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోపవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఎంతో విజయవంతమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చింది.ప్రస్తుతం ఏ భాషలో అయినా ఒక సినిమా విజయవంతం అయిందంటే చాలు ఇక ఆ సినిమా అన్ని భాషలలో రీమేక్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అయితే ఈ రీమేక్ అనేది ఇప్పుడు మాత్రమే కాకుండా గత కొంత సంవత్సరాల నుంచి విజయవంతమైన సినిమాలు రీమేక్ గా వస్తున్నాయి. ఈ విధంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. మరి అమితాబచ్చన్ నటించి, తెలుగులో రీమేక్ చేసిన సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సీనియర్ ఎన్టీఆర్ తన 52 వ యేటా అమితాబచ్చన్ నటించిన “జంజీర్” సినిమాను తెలుగులో “నిప్పులాంటి మనిషి” అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో విజయవంతమయింది. ఈ సినిమా తర్వాత అమితాబచ్చన్ నటించిన ఎన్నో సినిమాలను ఎన్టీఆర్ తెలుగులో రీమేక్ చేశారు. అమితాబచ్చన్ నటించిన మరో మూవీ “దో అంజానే” ఈ సినిమాను ఎన్టీఆర్ “మా వారి మంచితనం” అనే పేరుతో తెరకెక్కింది. బిగ్‌బీ ‘దీవార్’ను ఎన్టీఆర్..‘మగాడు’గా రీమేక్ చేసి విజయాన్ని అందుకున్నారు.
అమితాబ్ బచ్చన్ శశి కపూర్‌తో చేసిన ‘సుహాగ్’సినిమా రీమేక్ తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో “సత్యం శివం” సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. బచ్చన్ నటించిన ‘డాన్’ సినిమాను ఎన్టీఆర్ తెలుగులో “యుగంధర్” పేరుతో రీమేక్ చేశారు.ఇదే సినిమాను తమిళంలో అజిత్ బిల్లా తెలుగులో కూడా ప్రభాస్ బిల్లాగా చేశారు. తెలుగులో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఎన్టీఆర్ ఏఎన్నార్ మాత్రమే కాకుండా కృష్ణ, వంటి స్టార్ హీరోలు సైతం అమితాబచ్చన్ సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి రీమేక్. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.