Bhagavanth Kesari Teaser: నటసింహం నందమూరి బాలయ్య బాబు 108వ సినిమా “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా నేడు బాలకృష్ణ పుట్టిన రోజు కావటంతో…”భగవంత్ కేసరి” టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ ప్రారంభంలో అర్జున్ రాంపాల్ ను పాలకుడిగా పరిచయం చేయగా బాలకృష్ణ తనను తాను మొండి వాడిగా పరిచయం చేసుకోవడం జరిగింది. ఇక ‘అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అంటూ తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో బాలయ్య లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.
అదే రీతిలో “భగవంత్ కేసరి” టీజర్ ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తండ్రి కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో .. బాలకృష్ణ కూతురి పాత్రలో కుర్ర హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. “వీరసింహారెడ్డి” వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి సినిమా దసరా పండుగకు రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య కనిపిస్తూనే మరోపక్క అనిల్ రావిపూడి పంచ్ కామెడీ మిస్ అవ్వకుండా సినిమా చిత్రీకరిస్తున్నారట. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో “భగవంత్ కేసరి” ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి మళ్లీ బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో ఏపీలో 2024 ఎన్నికలకు ముందుగానే ఈ సినిమా రిలీజ్ చేసే తరహాలో.. బాలకృష్ణ ప్లాన్ వేసినట్లు సమాచారం. దీంతో అనిల్ రావిపూడి సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు.