సినిమా

Acharya: చిరుత పులుల్లా చిరు-చ‌ర‌ణ్ స్టెప్పులు.. ప్రోమోతోనే పిచ్చెక్కించారుగా!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. అప‌జ‌యం ఎరుగ‌ని డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించ‌గా.. సోనూసూద్ విల‌న్‌గా అల‌రించ‌బోతున్నారు. మణిశర్మ స్వ‌రాలు అందిస్తున్నారు. గ‌త ఏడాడే చీత్ర‌క‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం ఏప్రిల్ 29న విడుద‌ల అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా మేక‌ర్స్ `భలే భలే బంజారా` సాంగ్ ప్రోమోను బ‌య‌ట‌కు వ‌దిలారు. `హే సింబా రింబా.. చిరుతా పులులా చిందాటా.. సింబా రింబా సరదా పులులా సయ్యాట.. భలే భలే బంజారా, పచ్చ పంటేరా.. రే కచ్చేరిలో రెచ్చిపోదామురా` అంటూ సాగే లిరిక్స్ వినిసొంపుగా ఉన్నాయి.

అలాగే ఇందులో చిరు, చ‌ర‌ణ్‌లు చిరుతు పులుల్లా స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టారు. సేమ్ ఎన‌ర్జీతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ప్రోమోతోనే పిచ్చెక్కించేశారు. ఇక ఫుల్ సాంగ్‌ను మేక‌ర్స్ రేపు (ఏప్రిల్ 18) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ పాట‌కు మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.

 


Share

Related posts

Prabhas: రిలీజ్ అవ్వకుండానే 50% బడ్జెట్ రికవరీ చేసిన ప్రభాస్ సినిమా…??

sekhar

Megha Akash Photoshoot pics

Gallery Desk

BB3 Movie : సింహా..! లెజెండ్..! మూడో పేరు వింటే పూనకాలే..!?

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar