న్యూస్ సినిమా

Bhavadeeyudu Bhagathsingh: పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్‌గా ముగ్గురు..?

Share

Bhavadeeyudu Bhagathsingh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను కమిటైన సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని డిసైడయ్యాడు. ఇప్పటికే ఆయన చేయాల్సిన సినిమాలు పలు కారణాల వల్ల బాగా ఆలస్యం అయ్యాయి. అందుకే, బల్క్ డేట్స్ ఇచ్చి ఒక్కో సినిమా షూటింగ్‌ను తన పార్ట్ వరకు ఎంత త్వరగా పూర్తైతే అంత త్వరగా ఫినిష్ చేసేలా దర్శక, నిర్మాతలకు సూచించారు. ఈ క్రమంలోనే ముందు హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

bhavadeeyudu-bhagathsingh latest update
bhavadeeyudu-bhagathsingh latest update

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దాదాపు రూ 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందే పవన్ కళ్యాణ్ పార్ట్ చిత్రీకరణను కంప్లీట్ చేస్తాడట. అందుకే, జూన్ లేదా జులై నుంచి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కనుంచి భవదీయుడు భగత్‌సింగ్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.

Bhavadeeyudu Bhagathsingh: లక్కీ ఛాన్స్ అందుకునే ముగ్గురు యంగ్ బ్యూటీస్ ఎవరో..?

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే డీఎస్పీ కొన్ని అద్భుతమైన ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. అయితే, ఇందులో ఓ సూపర్ ఐటెం సాంగ్ ఉంటుందని దానికోసం స్పెషల్‌గా ముగ్గురు యంగ్ బ్యూటీలను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ముంతాజ్, హంసానందినిలతో కలిసి ఆడిపాడాడు పవన్. ఇప్పుడు భవదీయుడు లో యంగ్ బ్యూటీస్‌తో సందడి చేయనున్నాడట. మరి లక్కీ ఛాన్స్ అందుకునే ముగ్గురు యంగ్ బ్యూటీస్ ఎవరో చూడాలి. కాగా, పవన్ – హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


Share

Related posts

పవన్ కల్యాణ్ ‘ యాటిట్యూడ్ ‘ : నిజజీవితం లో అతని ప్రవర్తన గురించి నిజాలు చెప్పిన టాప్ డైరెక్టర్.

GRK

Pooja Hegde Beautiful Pics

Gallery Desk

వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

Siva Prasad