Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలంగాణలో ఉదయం నుండి బెనిఫిట్ షోలు పడటంతో పాటు పాజిటివ్ టాక్ రావడంతో… థియేటర్లు నిండిపోతున్నాయి. పవన్ పర్ఫామెన్స్ అదరగొట్టే రీతిలో ఉండటంతోపాటు… డానియల్ శేఖర్ గా నటించిన రానా తో నువ్వానేనా అన్నట్టుగా “బీమ్లా నాయక్” క్యారెక్టర్ ఉండటం అభిమానులను ఎంతగానో అలరించింది. మాటలు స్క్రీన్ ప్లే డైలాగులు అదరగొట్టే రీతిలో త్రివిక్రమ్ పనితనం కనబడింది అని చెబుతున్నారు.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ హిట్ కొట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ “బీమ్లా నాయక్” లో పవన్ పెర్ఫార్మెన్స్ పై తనదైన శైలిలో స్పందించారు. కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చినా గానీ అదిరిపోయింది అని పేర్కొన్నారు. సినిమాలో గర్జించే పవన్ కళ్యాణ్ ని చూశానని మైండ్ బ్లోయింగ్ కామెంట్ చేశారు. త్రివిక్రమ్ మరియు డైరెక్టర్ సాగర్ చంద్ర పనితనం చాలా అద్భుతంగా ఉందని పొగిడారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన కెరీర్లో ది బెస్ట్ ఇచ్చాడని పొగడ్తల వర్షం కురిపించారు. బీమ్లా నాయక్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… సినిమాకి బ్యాక్ బోన్ అని తెలిపారు. అదేవిధంగా సినిమాలో రానా నీ చూడలేదు, కేవలం డానియల్ శేఖర్ మాత్రమే కనబడ్డాడు.. అంటూ తనదైన శైలిలో హరీష్ శంకర్ బీమ్లా నాయక్ లో పవన్ నటన పై పొగడ్తల వర్షం కురిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్నిచోట్ల సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో… పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ మాదిరిగా పవన్ పెర్ఫార్మెన్స్ ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. పవన్ అభిమానులకు ఇది భారీ పవర్ ప్యాక్ అని చెప్పుకొస్తున్నారు. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో “బీమ్లా నాయక్” ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.