Bheemla Naayak: “బీమ్లా నాయక్” గత నెల 25వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “బీమ్లా నాయక్” టాలీవుడ్ బాక్సాఫీస్ నీ షేక్ చేసేస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు జనాలు పవన్ అభిమానులు పోటెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ సృష్టించిన ఈ తుఫాన్ వల్ల.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
దీనిలో భాగంగా జస్ట్ మూడు రోజుల్లో “బీమ్లా నాయక్” వంద కోట్ల క్లబ్ మార్క్ టచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురైనా గాని.. మూడు రోజుల్లోనే “బీమ్లా నాయక్” 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాలలో కూడా “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు పవన్ అభిమానులు.
సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి కే సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే మాటలు డైలాగులు త్రివిక్రమ్ అందించడం హైలెట్ గా మారింది. రన్ టైం పూర్తయ్యేసరికి దాదాపు 200 కోట్ల క్లబ్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉందని.. ట్రేడ్ వర్గాల అంచనా. దాదాపు పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ తరహాలో బ్లాక్ బస్టర్ “బీమ్లా నాయక్” రూపంలో మరోసారి పడింది అని తాజా విజయం పై పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.