Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమాని కే సాగర్ చంద్ర డైరెక్ట్ చేయడం తెలిసిందే. సినిమాల మీద ప్రేమతో అమెరికాలో చదువుకుంటున్న సాగర్ చంద్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడని నల్గొండ జిల్లా నుండి వచ్చాడని..”బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో బయటపడింది. ఇదిలా ఉంటే నిన్న “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హీరో హీరోయిన్లతో పాటు సినిమా టెక్నీషియన్లు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్.. శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యువకుడు దర్శకుడు కే సాగర్ చంద్ర ప్రతిభా శైలిని పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకుడిగా సినిమా గురించి సాగర్ చంద్ర మాట్లాడుతూ… త్రివిక్రమ్ లేకపోతే సినిమా లేదని పేర్కొన్నారు. సినిమాకి త్రివిక్రమ్ చాలా కీలకమైన పని చేయడం జరిగిందని స్పష్టం చేస్తూ ఇంకా అనేక విషయాలు తెలియజేశారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ పై తన విమానం గురించి తెలియజేస్తూ.. ఆయన నుండి నేర్చుకున్నది ఇదే అని.. సాగర్ చంద్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి.
గెలుపు అంటే మోజు లేదు… ఓటమి అంటే భయం లేదు.. చావే అంతం కాదు అన్నప్పుడు, చావుకు మాత్రం ఎందుకు భయపడటం, వెళ్లి ఆకాశంలో నించుని గర్జించు.. హైయిల్ పీఎస్.పికే అంటూ వివరించి.. పవన్ పై ఉన్న తన అభిమానాన్ని మాటల రూపంలో బయటపెట్టాడు సాగర్ చంద్ర. దాదాపు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ తో రెండు సంవత్సరాలపాటు ప్రయత్నించినట్లు ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేయడం జరిగింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!