Bheemla Naayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ అని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఖుషి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో… జల్సా వంటి హిట్ ఇచ్చి.. పవన్ కి మరింత దగ్గరయ్యారు. సినిమాలు విషయం మాత్రమే కాక పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా త్రివిక్రమ్ చాలా విషయాలు చూసుకుంటారని పవన్ సన్నిహితులు మాత్రమే కాక స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమా వేదికలపై పలు సందర్భాలలో తెలియజేయడం జరిగింది. అటువంటి త్రివిక్రమ్ “బీమ్లా నాయక్” సినిమాకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని… రచన మరియు స్క్రీన్ ప్లే అందించడంతో ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ పనితనాన్ని పవన్ పొగడ్తలతో ముంచెత్తారు.
“బీమ్లా నాయక్” ఒక పోలీస్ అధికారి కి మరియు కాబోయే రాజకీయ నాయకుడికి మధ్య జరిగే సంఘర్షణకి సంబంధించి అద్భుతంగా రచన చేసిన త్రివిక్రమ్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. డైరెక్టర్ సాగర్ చెప్పినట్టుగా సినిమాకి వెన్నెముక త్రివిక్రమ్ అని పవన్ స్పష్టం చేశారు. సినిమా కి ఆది నుండి చివరి వరకు మొత్తం త్రివిక్రమ్ అని కొనియాడారు. త్రివిక్రమ్ లేకపోతే “బీమ్లా నాయక్” లేదని పేర్కొన్నారు. సినిమాని త్రివిక్రమ్ ముందుండి నడిపించారు.
ఇంత మంది కళాకారులను టెక్నీషియన్లను బ్యాలెన్స్ చేసుకుని బీమ్లా నాయక్ అద్భుతంగా రావడంలో త్రివిక్రమ్ ప్రధాన పాత్ర పోషించారని పవన్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక తన తోటి నటుడు రానా డానియల్ శేఖర్ గా.. అద్భుతమైన నటన నటించారని హీరోయిన్లు సంయుక్త మీనన్, నిత్యా మీనన్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారని పవన్ పొగిడారు. మొత్తంమీద చూసుకుంటే బీమ్లా నాయక్ పునాది త్రివిక్రమ్ అని పవన్ తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.