Bheemla Naayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఆ దరిదాపుల్లో మరో సినిమా విడుదల చేయడానికి భయపడే పరిస్థితి. అయితే మహమ్మారి కరుణ తీసుకొచ్చి నష్టాల కారణంగా ఇప్పుడు పవన్ “బీమ్లా నాయక్” సినిమా రిలీజ్ రోజే మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అయినా గాని “బీమ్లా నాయక్” కి తిరుగుండదని .. ఆ రీతిగా వ్యాపారం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల లో టాక్ నడుస్తుంది. నైజాం రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు.. వరుసగా పది రోజులపాటు థియేటర్లు ఖాళీ ఉండకుండా.. వ్యాపారం చేయగలిగేలా సరికొత్త ప్లానింగ్ తో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఒక తెలుగు భాషలో మాత్రమే…”బీమ్లా నాయక్” 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.
తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో మరికొన్ని భాషల్లో కూడా “బీమ్లా నాయక్” రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితుల్లో పవన్ నటించిన “వకీల్ సాబ్” వందకోట్లు కలెక్ట్ చేయగా..”బీమ్లా నాయక్” మల్టీ స్టారర్ సినిమా కావటంతో.. గ్యారెంటీగా రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం పక్కా అని… ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు రిలీజ్ కి పది రోజులు మాత్రమే టైం ఉండటం తో… ప్రమోషన్ కార్యక్రమాలు తక్కువ సమయంలో భారీ ఎత్తున చేపట్టడానికి.. సినిమా యూనిట్ సరికొత్త ప్లానింగ్ తో వెళ్తుంది. ఈ వారం చివరిలో సినిమా ట్రైలర్ వచ్చేవారం.. రేయ్ రిలీజ్ వేడుక జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.