Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ప్రీ రిలీజ్ వేడుక మరి కొద్ది క్షణాలలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు “బీమ్లా నాయక్”.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుకలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ ప్రియ రిలీజ్ వేడుకకు సంబంధించి సినిమా యూనిట్.. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ నీ సెలెక్ట్ చేసుకోవడానికి సెంటిమెంట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో మెగా హీరోలకు సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సినిమాలు మొత్తం కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయట. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం, త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన అలా వైకుంఠపురం లో, సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల బన్నీ నటించిన “పుష్ప” సినిమా వేడుకలు అన్నీ కూడా ఇక్కడే జరగడంతో ఆ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడంతో దాన్ని సెంటిమెంట్ గా పెట్టుకొని “బీమ్లా నాయక్”..సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్ చేయడం జరిగిందట. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో రానా నటిస్తున్న సినిమా కావడంతో అటు దగ్గుబాటి అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతున్న తరుణంలో… ఇండస్ట్రీలో కోలాహలం వాతావరణం నెలకొంది.