Bheemla nayak: ఈ మధ్య కాలంలో మ్యూజిక్ సెన్షేషన్ థమన్‌కు ప్రశంసలే గానీ, విమర్శలు అంటూ వినిపించింది లేదనే చెప్పాలి. కొందరి నెటిజన్స్ ఏవో ట్రోల్ చేసినా కూడా అవి ఏమాత్రం థమన్ పై ప్రభావం చూపించలేదు. ఇంకా చెప్పాలంటే థమన్‌కు ఇప్పుడు అందుతున్న ప్రశంసలతో చూస్తే అవి జూజూబీ. అల వైకుంఠపురములో తర్వాత థమన్‌ను పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. అందరి హీరోల, దర్శక, నిర్మాతల ఛాయిస్ థమన్ అయిపోయాడు. వకీల్ సాబ్, క్రాక్, ఇటీవల వచ్చిన అఖండ చిత్రాలు థమన్ రేంజ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్ళాయి. అఖండ సినిమా బీజీఎం థమన్‌కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది.
ఈ సక్సెస్ ఏకంగా థమన్ చేతికి ప్రభాస్ – పూజా హెగ్డేల పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమాకు బీజీఎం ఇచ్చే అవకాశం అందుకున్నాడు. ఇది థమన్‌కు పెద్ద డ్రీమ్. ఇక ప్రస్తుతం థమన్ సంగీతం అందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భీమ్లా నాయక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్ ఒకటి. ఈ సినిమాకు థమన్ అందిస్తున్న సంగీతం పీక్స్ అని ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, పవన్, రానాల టీజర్స్ చూస్తే అర్థమైంది. అన్ని సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టాయి.
Bheemla nayak: రిలీజైన కొద్దిసేపటి నుంచే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి.
ఇక రెండు టీజర్స్కు థమన్ ఇచ్చిన బీజీఎం కు బాక్సులు బద్దలయ్యాయి. అందుకే భీమ్లా నాయక్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే న్యూఇయర్ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి లా లా భీమ్లా డీజే వెర్షన్ ఇచ్చాడు థమన్. రిలీజ్‌కు ముందు ఈ డీజే వెర్షన్ మీద భారీ అంచనాలు రేపాడు థమన్. కానీ, ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడని ఇది రిలీజైన కొద్దిసేపటి నుంచే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. అభిమానులతో పాటు ప్రేక్షకులు ఈ సాంగ్ అనవసరంగా రిలీజ్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న అందరినీ థమన్ తీవ్రంగా నిరాశపరచాడని చెప్పుకుంటున్నారు.