న్యూస్ సినిమా

Bheemla nayak: ఇదే నిజమైతే ఈ ఏడాది అన్నీ రికార్డ్స్ పవన్ కళ్యాణ్‌వే..

Share

Bheemla nayak: పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న తాజా మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేతో పాటుగా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకి అధికారిక రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు రీమేక్ సినిమా రన్ టైం చాలా తగ్గిస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్ టైం ఉన్న సినిమా అంటే ఇదే అనుకోవచ్చు.

bheemla-nayak-is going to make another record
bheemla-nayak-is going to make another record

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా రన్ టైం 175 నిమిషాలు ఉంటుంది. అంటే కాస్త అటు ఇటుగా 3 గంటలు. అయితే, తెలుగు వెర్షన్ కి మాత్రం అంత రన్ టైం ఉండదట. ఈ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమా మొత్తం నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో నుంచి చాలా ఇంత తక్కువ నిడివితో వచ్చే సినిమా ‘భీమ్లా నాయక్’ అని చెప్పొచ్చు.

Bheemla nayak: రన్ టైమే సినిమాకు ఇప్పుడు పెద్ద ప్లస్ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు. రానా సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తోంది. ఇప్పటికే వీరి పాత్రలను పరిచయం చేయగా బాగా ఆకట్టుకున్నాయి. ఎస్ ఎస్ థమన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే బాక్సులు బద్దలు కొడుతోంది. పవన్, రానా కలిసి నటిస్తున్న ఈ భారీ మాస్ మల్టీస్టారర్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చెప్పలేము. రన్ టైమే సినిమాకు ఇప్పుడు పెద్ద ప్లస్ అవుతుందని తెలుస్తోంది.


Share

Related posts

Eatela Rajendar: ఈట‌ల కంటే ఎక్కువ‌గా టీఆర్ఎస్ నేత‌ల‌ను ప‌రేషాన్ చేస్తుంది ఈయ‌నే

sridhar

బిగ్ బాస్ 4 : హౌస్ లో గంగవ్వ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే…

arun kanna

Intinti Gruhalakshmi: నీ భర్తనే కాపాడుకోలేని మీరు.. నా భర్త ను ఎలా కాపాడుతారు తులసి ఆంటీ..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar