RGV: ఇది కొన్ని రోజుల కిందటి మాట. అవును.. కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ పై వరుసపెట్టి ట్వీట్లు వేశాడు రామ్ గోపాల్ వర్మ. విషయం ఏమంటే, భీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా బాలీవుడ్లో రిలీజ్ చేస్తే బొమ్మ అదుర్స్ అంటూ జోస్యం చెప్పాడు. అక్కడితో ఆగకుండా తెలుగు వీరులు అయినటువంటి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్టోరీలతో తెరకెక్కిన RRR సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్నప్పుడు దమ్మున్న భీమ్లానాయక్ సినిమా ఎందుకు పాన్ ఇండియా సబ్జెక్ట్ అవ్వదని ప్రశ్నించాడు వర్మ.
Pawan kalyan: తమిళ హీరో కోసం మన పవర్ స్టార్ వెనక్కి తగ్గడం ఏంటీ..ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
RGV: భీమ్లానాయక్ నిర్మాత స్పందన:
ఇక ఈ మేటర్ పవన్ వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ, నిర్మాతలు ప్రస్తుతం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, భీమ్లా నాయక్ గురించి నాగవంశీని ప్రశ్నించినప్పుడు, “సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మేము ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నాం” అంటూ ప్రకటించాడు. కాగా మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు భీమ్లానాయక్ రీమేక్ అన్న సంగతి తెలిసినదే కదా.
Manchu Lakshmi: ఆనందంతో ఉప్పొంగిపోతున్న మంచు లక్ష్మి..కారణం అదే..!
సినిమా వివరాలు:
ఈ సినిమా కేవలం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా యొక్క సింగల్ లైన్ బేస్ చేసుకొని పవన్ స్టయిల్ కు తగ్గట్టు మార్చేశాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాకు మన త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. దర్శకత్వం మాత్రం సాగర్ చంద్ర చేశాడు. సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది భీమ్లానాయక్.