24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
సినిమా

Bheemla Nayak: ప్ర‌ముఖ ఓటీటీకి `భీమ్లా నాయ‌క్‌`.. ఎన్ని కోట్ల‌కు డీల్ కుదిరిందో తెలుసా?

Share

Bheemla Nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌ను పోషించారు.

అలాగే నిత్య మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందించారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత థియేటర్‌లో రిలీజైన సినిమాలు.. కొద్ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఓటీటీలో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే భీమ్లా నాయ‌క్ చిత్రం కోసం చాలా ఓటీటీలు పోటీ ప‌డ్డాయ‌ట‌. అయితే చివ‌ర‌కు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌.

అందుకుగానూ, హాట్ స్టార్ ఏకంగా రూ. 70 కోట్ల‌ను చెల్లించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌ థియేట‌ర్స్‌లో విడుద‌లైన నాలుగు వారాల త‌ర్వాత భీమ్లా నాయ‌క్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్‌. ఏదేమైనా ప‌వ‌న్ కెరీర్‌లో ఇదొక రికార్డ్ డీల్‌గా చెప్పుకోవ‌చ్చు.


Share

Related posts

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని తీవ్ర నిరాశకి గురవుతున్న స్టార్ హీరోయిన్?

Ram

Aacharya : “ఆచార్య” రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్..!!

sekhar

vj Maheswari Saree Photos

Gallery Desk