Bheemla Nayak: ఎట్టకేలకు పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమా అనుకున్న తేదీకే భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పలు వాయిదాలు..సందేహాలు, చర్చల తర్వాత ఫైనల్‌గా ఫిబ్రవరి 25వ తేదీనే ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక హిందీలో కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండటం విశేషం. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి తెలుగులో భీమ్లా నాయక్ అంటూ వస్తున్న రీమేక్ వెర్షన్ ఊహించని స్థాయిలో అంచనాలున్నాయి. ఒరిజినల్ వెర్షన్ కూడా ఇంత హైప్ క్రియేట్ చేయలేదు.
అదే సౌత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ క్రేజ్ అండ్ స్టామినా. ఇక రానా లాంటి భారీ కటౌట్ ఉండటంతో ఈ మల్టీస్టారర్ సినిమాకు ఇంకా క్రేజ్ బాగా ఏర్పడింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని తెలుపుతూ మరోసారి రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేస్తూ నిర్మాతలు పవన్ పోస్టర్‌ను వదిలారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్‌గా..బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక దీనికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
Bheemla Nayak: ఈవెంట్లో పవన్ ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే.
హైదరాబాద్‌లోనీ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో అత్యంత భారీ స్థాయిలో భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతుండగా అందరిలోనూ ఒకింత టెన్షన్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 25 వ తేదీన చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారట. అయితే, ఈ ఈవెంట్లో ఏ పీ ప్రభుత్వం మీద అక్కడ నాయకుల మీద ఎలా రియాక్ట్ అవుతారో అని డిస్ట్రిబ్యూటర్స్ కాస్త కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో పవన్ ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో..ఈ సినిమాకు ఏపీలో ఎలాంటి వెసులుబాటు ఉంటుందో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?