Bheemla nayak: కరోనా థర్డ్ వేవ్ వైరస్ భారీగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా షూటింగ్స్ ఆగిపోతున్నాయి. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలన్ని మళ్ళీ రీ షెడ్యూల్ అవుతున్నాయి. థర్డ్ వేవ్ దెబ్బకు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం మొదలైంది. చిన్న బడ్జెట్, మీడియం బడ్జెట్ అలాగే పాన్ ఇండియన్ సినిమాలు అనుకున్న విడుదల తేదీని వాయిదా వేస్తున్నాయి. ఆచార్య లాంటి సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కొత్త తేదీని ప్రకటిస్తున్నారు.
కానీ, థియేటర్స్‌లో బొమ్మ పడేవరకు గ్యారెంటీ లేదని ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలతో అర్థమైంది. జనాలు కూడా ఇంతకముందు మాదిరిగా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే సర్ప్రైజింగ్గా ఫీలయ్యే రోజులు పోయాయి. ఆ.. ఇలాంటి డేట్స్, పోస్ట్ పోన్స్ ఎన్ని చూడలేదు అనే మైండ్ సెట్‌కి వచ్చేశారు. ఇక టాలీవుడ్లో క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Bheemla nayak: పదే పదే కన్ఫర్మ్ చేసి చివరకి పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 25న రిలీజ్ అని కూడా మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కానీ, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం భీమ్లా నాయక్ యూనిట్లో కొందరికి పాజిటివ్ వచ్చిందట. అందుకే కొంత టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే మాట
వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో మేకర్స్ క్లారిటీ ఇస్తేగానీ తెలీదు. అంతక ముందు నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం సంక్రాంతికి వస్తున్నట్టు పదే పదే కన్ఫర్మ్ చేసి చివరకి పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే.