Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ భీమ్లా నాయక్. ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ గురించి కూడా అందరూ చాలా రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే డిసెంబర్లోనే భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ రావాల్సింది. కానీ, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన కారణంతో మేకర్స్ ట్రైలర్ విడుదలను నిలిపివేశారు. అయితే, తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారట.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. సినిమా ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్లో దర్శకుడు సాగర్ కె చంద్ర చూపించేస్తాడట. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా భీమ్లా నాయక్ రూపొందుతోంది. మలయాళంలో హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రెండింతలు యాక్షన్ సీన్స్ తెలుగు వెర్షన్ అయిన భీమ్లా నాయక్ మూవీలో ఉండబోతున్నాయట. ఇక ఈ ట్రైలర్ కట్ 2 నిమిషాల 20 సెకన్లు ఉండనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ హై యాక్షన్ సీన్స్ అలాగే ఆయన ఎలివేషన్ షాట్స్‌తో అలరించనుందని తెలుస్తోంది.
Bheemla nayak: ఫిబ్రవరి 25వ తేదీనే భీమ్లా నాయక్ విడుదల..!
ఇక పవన్ కళ్యాణ్- రానా ఇద్దరు సమానంగా స్క్రీన్ స్పేస్ ఉండేలా ట్రైలర్ కట్ చేసినట్టు సమాచారం. వీరి మధ్య ఉండే ఫైట్ సీక్వెన్స్ ఈ ట్రైలర్లో హైలైట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సెన్షేషన్ అయిన ఎస్ ఎస్ థమన్ హెవీ బీజీఎం ఈ ట్రైలర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ట్రైలర్‌తోనే కొత్త రికార్డ్స్ సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన సంగతి తెలిసిందే. మాటా మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, ఓ పాటతో పాటు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అనుకుంటున్న ఫిబ్రవరి 25వ తేదీనే భీమ్లా నాయక్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.