న్యూస్ సినిమా

Bheemla nayak: ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది..ఓటీటీలో కూడా ఓ రోజు ముందుగా వచ్చేస్తుంది

Share

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సర్‌ప్రైజెస్ ఇచ్చారు. గత నెల 25వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా పవన్ ఖాతలో మరో హిట్ సినిమాగా చేరింది. మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కి అధికారిక రీమేక్‌గా తెలుగులో భీమ్లా నాయక్ సినిమాను నిర్మించారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించిన ఈ సినిమాను ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగో సమస్యలు ఆధారంగా చేసుకొని పక్క కమర్షియల్ సినిమాగా త్రివిక్రం శ్రీనివాస్ ఒరిజినల్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసి కథ – మాటలు అందించారు.

bheemla-nayak-two latest surprising updates
bheemla-nayak-two latest surprising updates

ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీస్ నిత్యా మీనన్, సంయుక్త మీనన్ పవన్, రానాల సరసన నటించారు. ఈ నాలుగు పాత్రలు సినిమాలో బాగా అలరించాయి. ముఖ్యంగా పవన్ – రానా పాత్రలను మలిచిన విధానం సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ కావడానికి కారణం అయింది. ఇక దేశ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఒక్క ఏపీలో తప్ప మిగిలిన అన్నీ చోట్లా బ్రేకీవెన్ టార్గెట్‌ను రీచ్ అయింది. ఏపీలో కూడా మంచి లాభాలను తెచ్చేదే. కానీ, టికెట్ రేట్ సమస్య వల్ల అక్కడ బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ కాలేకపోయింది.

Bheemla nayak: ఒక రోజు ముందుగానే ఈ రెండు ఓటీటీలలో భీమ్లా నాయక్..!

ఇక ఈ సినిమాలో ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్‌గా మిగిలింది. కాగా, ఇటీవల భీమ్లా నాయక్ సినిమాను రెండు ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, తెలుగు ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. మార్చి 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు కూడా డేట్ ప్రకటించారు. కానీ, సర్‌ప్రైజ్ ఇస్తూ ఒక రోజు ముందుగానే ఈ రెండు ఓటీటీలలో భీమ్లా నాయక్ వచ్చేస్తోంది. అంతేకాదు, తాజాగా భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వీడియో రిలీజైంది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది.


Share

Related posts

కాస్త ఇటు వైపు చూడు జగన్..? పార్టీలో సమస్యలు చాలా ఉన్నాయి

Special Bureau

Vasantha Kokila: ఆసక్తి రేకెత్తిస్తున్న “వసంత కోకిల” టీజర్..!!

bharani jella

ఎన్నేళ్ల‌కో…

Siva Prasad