Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజై మోత మోగిస్తోంది. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా వేగంగా బుకింగ్స్ ను పూర్తిచేసుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను హిందీలో ఈ రోజునే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ కాలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత నొచ్చుకున్నారు.
Bheemla Naayak: వేట స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ “బీమ్లా నాయక్” బ్రేకింగ్ రికార్డ్స్..!!
Bheemla Nayak: హిందీ వెర్షన్ వస్తుందా?
హిందీ డబ్బింగ్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, చివరి నిమిషంలో రిలీజ్ నిర్ణయాన్ని చిత్ర బృందం మార్చుకున్నట్టు భోగట్టా. ఇక ఈరోజు అక్కడ విడుదల కావాల్సిన సినిమా మార్చి 4వ తేదీన భారీస్థాయిలో హిందీలో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో పక్క ప్లాన్ వేసి మరీ రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ టాక్ రావడం వలన కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Bheemla Naayak: “బీమ్లా నాయక్” హిందీ రిలీజ్ డేట్..!!
మరింత సమాచారం:
ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి. రిలీజైన దాదాపు ఎన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే తమన్ సంగీతంతో మేజిక్ చేసాడు. ఆయన స్వరపరిచిన పాటలు ఈ సినిమాపై మరింత ప్రభావాన్ని చూపాయి. నిత్యామీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా మంచి నటనని కనబరిచారు. సముద్రఖని, రావు రమేశ్, మురళీ శర్మ తమ పాత్రల పరిధిమేర నటించారు.