నితిన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `భీష్మ`. `సింగిల్ ఫర్ ఎవర్` ట్యాగ్ లైన్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చేతిలో పువ్వు.. నా ప్రేయసి ఎవరవుతారో…ఈ క్రిస్మస్కైనా శాంతా క్లాజ్ అమ్మాయిని బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను..భీష్మ ఈ క్రిస్మస్కి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు“ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!