Bhola Shankar: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వేదాలం సినిమా రీమేక్ ఇది. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా సూపర్ విజయం సాధించింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. కాగా తెలుగులో తేరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈరోజు ఉగాది నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది.
ఆగస్టు 11వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిరంజీవి.. కీర్తి సురేష్ ఫోటోతో పాటు హీరోయిన్ తమన్నా ఫోటోతో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మరోపక్క “భోళా శంకర్” ఫలితం విషయంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కారణం సినిమా దర్శకుడు మెహర్ రమేష్. చాలా కాలం తర్వాత ఆయన సినిమా దర్శకత్వం చేస్తున్నారు. పైగా అంతకుముందు చేసిన సినిమాలు చాలా వరకు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో వరుస విజయాల మీద ఉన్న చిరంజీవికి “భోళా శంకర్” తో డ్యామేజ్ ఏమైనా చేస్తాడా అని లోలోన ఆందోళన చెందుతున్నారట.
వాస్తవానికి సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. సమ్మర్ నీ టార్గెట్ చేసుకుని..”భోళా శంకర్” స్టార్ట్ చేయడం జరిగిందట. కానీ వేసవిలో చాలా సినిమాలో వస్తూ ఉండటంతో చిరంజీవి కొద్దిగా వెనక్కి తగ్గరట. ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “వాల్తేరు వీరయ్య”తో చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు. కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇవ్వాలని ఆగస్టు 11కి సినిమా విడుదలకి మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం చిరంజీవితో తమన్నా నటిస్తూ ఉంది. దీంతో మెగా కాంపౌండ్ లో నేను హీరోల అందరితో నటించిన హీరోయిన్ గా తమన్నా నిలిచింది.