Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత ఒక్క హిట్టు కూడా పడలేదు. 2018లో “బాహుబలి 2″తో చరిత్రత్మకమైన విజయాన్ని అందుకున్న ప్రభాస్…పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించాడు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన “సాహో”, “రాధేశ్యం” రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు “బాహుబలి 2” రిలీజ్ అవ్వకముందే ప్రభాస్ ఓకే చేయడం జరిగింది. కానీ ఇప్పటి నుండి ప్రభాస్ చేస్తున్న సినిమాలు “బాహుబలి 2” హిట్ తర్వాత ఒప్పుకున్న సినిమాలు.
బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్”, “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్టు కే” సినిమా చేస్తున్నరు. ఈ మూడింటిలో “ఆదిపరుష్” జూన్ 26న రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో “సలార్” రిలీజ్ కానుంది. ఆ తర్వాత 2024లో “ప్రాజెక్టు కే” విడుదల కానుంది. అయితే ఈ మధ్యలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్.. అక్కగా భూమిక కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. చాలా కీలకమైన పాత్ర భూమికకి డైరెక్టర్ మారుతి సెట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాని కేవలం కొద్ది నెలలలోనే కంప్లీట్ చేసే తరహాలో మారుతి ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
సినిమా మొత్తం ఒక సెట్ లో ఉండే రీతిలో హర్రర్ నేపథ్యంలో కామెడీ తరహాలో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ప్రభాస్ అభిమానులు ఈ ప్రాజెక్టుపై కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటుగా హిట్టు కొట్టాక ఇటువంటి ప్రయోగాలకు వెళ్తే బాగుంటుందని… అప్పటివరకు మారుతి ప్రాజెక్టు పక్కన పెట్టాలని సోషల్ మీడియాలో ఈ వార్తలపై కామెంట్లు పెడుతున్నారు.