Bhumika: భూమిక చావ్లా.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `యువకుడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భూమిక.. తన రెండో చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసింది. అదే `ఖుషి`. ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం నిర్మించారు.
2001 ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్, భూమికల మధ్య కెమెస్ట్రీ ఒక హైలైట్‌గా నిలిస్తే.. మణి శర్మ అందించిన సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో `అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా` సాంగ్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది.
అయితే ఇప్పుడు ఆ సూపర్ హిట్ సాంగ్‌కే భూమిక స్టెప్పులు వేసి.. ఖుషీ సినిమా జ్ఞాపకాలను నెమరవేసుకుంది. తన స్నేహితురాలు సవితతో కలసి ఈ సాంగ్ కి ఫుల్ జోష్‌లో డాన్స్ ఇరగదీసిన భూమిక.. అందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
నేను నా స్నేహితురాలు సవిత కలసి ఖుషి సాంగ్ ని రీ క్రియేట్ చేశాం అని కామెంట్ పెట్టింది. దీంతో భూమిక తాజా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సో స్వీట్, క్యూట్, భూమికలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CaAGc77r0YW/?utm_source=ig_web_copy_link
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!