ఏడేళ్లుగా జబర్దస్త్ చూస్తున్న డై హార్ట్ ఫ్యాన్స్ అందరికీ బిగ్ బ్యాడ్ న్యూస్..!!

తెలుగు టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగులలో రికార్డు సృష్టించడంలో ముందున్న కామెడీ షో జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షోకి విపరీతంగా ప్రేక్షక ఆదరణ ఉంది. ఏడేళ్లుగా టెలివిజన్ రంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నా ఈ షో టిఆర్పి రేటింగ్ తాజాగా పదికి ఐదు దగ్గరే ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు ఎదురు లేదు అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పరిస్థితులు మొత్తం తారుమారు అయినట్లు…. అసలైన ఈ టైం లో నిలవాలని అందుకు తగ్గట్టు జబర్దస్త్ టీం సన్నాహాలు చేస్తున్నారు.

అవమానం: ఈటీవి 'జబర్దస్' షోపై పోలీసులకు ఫిర్యాదు | Gowda students assocation  complains against Jabardasth - Telugu Oneindiaపూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం జబర్దస్త్ షో కి రెండు కార్యక్రమాలు పోటీగా వచ్చాయట. అది ఒకటి బిగ్ బాస్ రియాల్టీ షో అయితే మరొకటి ఐపీఎల్. ఈ రెండు కార్యక్రమాలు కూడా జబర్దస్త్ ప్రసారమయ్యే సమయంలోనే అవి కూడా టెలికాస్ట్ అవ్వుతున్నాయి. పైగా బిగ్ బాస్ ఇంట్లో హాట్ హాట్ ముద్దుగుమ్మలు ఇటీవల వైల్డ్ కార్డు రూపంలో పంపటంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ రెండు కార్యక్రమాలపై పడినట్లు టాక్.

 

ఈ పరిణామంతో జబర్దస్త్ రేటింగులు పడిపోయినట్లు ఇది ఖచ్చితంగా జబర్దస్త్ చూస్తున్నా డై హార్డ్ ఫ్యాన్స్ కి బిగ్ బాడ్ న్యూస్ అని అంటున్నారు. బిగ్ బాస్ మరియు ఐపీఎల్ ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ లలో దూసుకుపోతున్నాయి. తన సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకోవడానికి జబర్దస్త్ షో నిర్వాహకులు సరికొత్త స్కిట్ లతో రాబోయే రోజుల్లో రానున్నట్లు టెలివిజన్ రంగంలో టాక్ వినపడుతోంది.