Jawan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా నిన్న విడుదల అయి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవటం జరిగింది. ఈ సినిమాలో షారుక్ పైవిద్యమైన పాత్రలు అభిమానులను ఎంతగానో అలరించాయి. అట్లీ దర్శకత్వం మార్త మొదలుకొని సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2018లో “జీరో” సినిమాతో పరాజయం ఎదుర్కొన్న షారుఖ్ 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుని..

ఈ ఏడాది ప్రారంభంలో “పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం జరిగింది. తర్వాత ఏడు నెలల గ్యాప్ లోనే ఇప్పుడు “జవాన్” సినిమాతో “పఠాన్” సినిమా కంటే అతి పెద్ద విజయాన్ని.. షారుక్ నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాటలు ఇంకా కామెడీ లేకపోవడంతో.. షారుక్ నీ అభిమానించే క్లాస్ ఆడియన్స్ సినిమా పాటలు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారట.

షారుక్ ఖాన్ కి మాస్ ఇమేజ్ కంటే క్లాస్ ఇమేజ్ ఎక్కువ. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా షారుక్ కి ఉన్న మార్కెట్ ఇండియాలో మరో హీరోకి లేదు. దీంతో ఓవర్సీస్ లో పూర్తి మాస్ నేపథ్యం కలిగిన జవాన్ సినిమాకి అంతగా కలెక్షన్స్ రావట్లేదట అని టాక్. “జవాన్” సినిమా బ్లాక్ బస్టర్ అయిందని నిన్న అంత సంబరాలలో ఉన్న సినిమా యూనిట్ కి ఇది అతి పెద్ద బిగ్ బ్యాడ్ న్యూస్ అని బాలీవుడ్ వర్గాలలో టాక్.

వాస్తవానికి షారుక్ సినిమాకి ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో వసూలు వస్తాయి. అయితే ఇండియాలో భారీ బ్లాక్ బస్టర్ అయినా గాని తన అసలు సిసలైన మార్కెట్ ఓవర్సీస్ లో.. రెండో రోజే నెగిటివ్ రిపోర్ట్స్ రావడం ఫుల్ హ్యాపీగా ఉన్న షారుక్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ సినిమా పూర్తి మాస్ నేపథ్యం.. కంటెంట్ కలిగినది కావడంతోపాటు హీరో ఎలివేషన్స్ ఎక్కువగా ఉండటంతో.. ఓవర్సీస్ ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదట. ఈ సినిమా ఇండియాలో వస్తువులు బాగా రాబడుతున్న గాని విదేశీ మార్కెట్ లో రెండో రోజు వసూలు పడిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా జవాన్ వెయ్యి కోట్లు సాధిస్తుందని సినిమా యూనిట్ చాలా దీమాగా ఉందట.