Samantha: గత ఏడాది మయోస్సైటీస్ అనే అరుదైన ప్రాణాంతకర వ్యాధి బారిన పడిన సమంత ఏడాది మార్చిలో కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నిమిత్తం.. చాలా పవర్ ఫూల్ ట్రీట్మెంట్ కోసం దాదాపు 6 నెలలపాటు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంది. చికిత్స తీసుకుంటున్న టైంలో సమంత తన గ్లామర్ పోగొట్టుకోవడం జరిగింది.

అయితే అప్పటికే కొన్ని సినిమాలు సగం చేయటంతో ఫిబ్రవరి నెలలో కోలుకున్న సమంత మళ్ళీ తిరిగి.. మునుపటి గ్లామర్ పొందుకోవడానికి మార్చి వరకు పలు వర్కౌట్స్ చేయడం జరిగింది. తర్వాత “ఖుషి” సినిమా కంప్లీట్ చేయడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన “ఖుషి” పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మూడు రోజులకే 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్దగా సమంత కనిపించలేదు.

సరిగ్గా సినిమా విడుదలకు ముందు అమెరికా వెళ్ళిపోయింది. అంతకుముందు సినిమా మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో స్టేజి మీద డాన్స్ చేసింది. తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఇప్పుడు “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”, షారుఖాన్ నటించిన “జవాన్” సినిమా విడుదల కావడంతో.. “ఖుషి” కలెక్షన్స్ పడిపోయే పరిస్థితి నెలకొన్నట్లు మేకర్స్ భావిస్తున్నారట.

దీంతో సినిమా సక్సెస్ మీట్స్ ఎక్కువ చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సక్సెస్ మీట్ లలో కూడా సమంత పాల్గొనడం లేదట. ఎందుకంటే మయోసైటీస్ బారిన పడిన తర్వాత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత దాదాపు ఏడాది పాటు సినిమా షూటింగులకు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో “ఖుషి” తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో ఏడాది పాటు అమెరికాలోనే ఉండాలని సమంత ఫిక్స్ అయిందట. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మునుపటి గ్లామర్ సంపాదించి తర్వాత ఇండియా చేరుకోవాలని డిసైడ్ అయ్యిందట. అందువల్లే “ఖుషి” సినిమాకి ముందు వెళ్లిన సమంత.. సక్సెస్ మీట్ లేదా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా లైట్ తీసుకోవడం జరిగిందట. ఒక ఏడాది పాటు పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని సమంత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. సో ఏడాది పాటు సమంత సినిమాలకు దూరంగా ఉండటం అనేది ఆమెను అభిమానించే వాళ్ళకి బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కెరియర్ పరంగా గ్యాప్ వస్తే తర్వాత అవకాశాలు అందుకోవటం చాలా కష్టం. అయినా గాని ఆరోగ్యం కోసం సమంత తీసుకున్న ఈ నిర్ణయం.. ఆమె కెరీర్ కి ఏ రకంగా ఉపయోగపడుతుందో చూడాలి.