బిగ్ బాస్ 4 అప్డేట్ : ఆమె ను మాత్రం వద్దనే వద్దు అనేశారు…?

Share

ఇప్పటికే థియేటర్లు లేక ఎంటర్టైన్మెంట్ కు బాగా దూరమైన టాలీవుడ్ ప్రజలను అలరించేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో…. బాస్ – 4, తెలుగు బిగ్ ముస్తాబు అవుతోంది. ఇకపోతే ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున కన్ఫర్మ్ అయిపోగా.. అందుకు సంబంధించిన ఒక ప్రోమో ను కూడా ‘స్టార్ మా’ వారు వదిలారు. అలాగే అక్కినేని నాగార్జున బిగ్ బాస్ నూతన సీజన్ కు సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్ లను కూడా విడుదల చేశారు. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ ఓపెనింగ్ ప్రీమియర్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోందని సమాచారం.

 

Happy Birthday Poonam Kaur: Check out the actress' beautiful pics ...

ఇదిలా ఉండగా…. ఇప్పటికే అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ యాంకర్ ఝాన్సీ, అనసూయ, సుడిగాలి సుదీర్ పేర్లు బయటకు రాగా వారంతా తాము ఈ షో లో పాల్గొనడం లేదని తోసిపుచ్చారు. ఇక ఇప్పుడు కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం ఏమిటంటే…. నటి పూనమ్ కౌర్ బిగ్ బాస్ తెలుగు వారిని…. తాను ఆ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు తన ప్రొఫైల్ ఇచ్చారట. ముందు సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ ను చూసి ఆర్గనైజర్లు ఆమె పేరుని పరిశీలించినప్పటికీ…. ఆమె ఇప్పటికే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అలాగే మరికొందరు టాప్ డైరెక్టర్స్ పైన చేసిన తీవ్రమైన కామెంట్స్…. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ కూడా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారట. 

అలాగే పూనమ్ కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా చివరికి టీమ్ అంతా చర్చించుకొని అసలు ఈమె వద్దనే వద్దు అంటూ ఆమెను రిజెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ నాలుగో సీజన్ ను మొదట ఆగస్టు 30న మొదలు పెడదామని అనుకున్నా అది కాస్తా సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయిందని సమాచారం.


Share

Related posts

కరోనా వైరస్ వ్యాక్సిన్ పనితీరు పై ఐసిఎంఆర్ వ్యాఖ్యలు

S PATTABHI RAMBABU

YS Sharmila: షర్మిల ఏమాత్రం తగ్గడం లేదుగా!మళ్లీ కేసీఆర్ పై గరం గరం!!

Yandamuri

ఏపీ ప్రభుత్వంపై నోబెల్ శాంతి గ్రహీత ప్రశంసల జల్లు

Mahesh