జబర్ధస్త్ షో ఎంతో మందికి నిలువనీడలనిచ్చిందని అందరికీ తెలిసిన విషయమే.. నవ్విస్తూ బతికేయవచ్చని అందులో పాల్గొంటున్న కాంటెస్టంట్లను చూస్తేనే అర్థమవుతుంది. అలాగే వారి నవ్వుల వెనుక వారి చీకటి ప్రపంచం నుండి ఏవిధంగా వచ్చామనేది చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఈ జబర్ధస్త్ షో ఎంతో మందికి మంచి ప్లాట్ ఫాం అయ్యింది.
దీని ద్వారా అందులో స్కిట్ చేసిన వారు ఎంతో మంచి పొజిషన్ లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. కాగా ఈ షో ద్వారానే పాపులారిటీ సంపాధించి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ముక్కు అవినాశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్ధస్త్ లో ఏవిధంగా నైతే తన స్కిట్ ల ద్వారా నటించేవాడో.. బిగ్ బాస్ లో కూడా అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ, బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు.
కాగా ఈ బిగ్ బాస్ నుంచి అవినాశ్ బయటకు వచ్చినాకా అతడిని మళ్లీ జబర్ధస్త్ లోకి తీసుకునే చాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇంతకుముందున్న టీం లో కాకుండా వేరే టీం లో వేసే అవకాశముందని తెలుస్తోంది. దీనికి కారణం కెవ్వు కార్తీక్ టీం ఈ మధ్య అందరినీ తన పర్ఫామెన్స్ ద్వారా నవ్విస్తున్న ఇమ్మాన్యూయేల్ దీనికి కారణమని అనుకుంటున్నారు.
ఇమ్మాన్యూయెల్ వేస్తున్న పంచ్ లకు ఆడియెన్స్ బాగా లైక్ చేస్తున్నారు. దాంతో మళ్లీ అవినాశ్ ను టీం లో పెడితే టీం డిస్టబెన్స్ అవుతుందని యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి అవినాశ్ లేని టైం లో ఇమ్మాన్యుయెల్ తన ప్రతిభను బయటపెట్టి అవినాశ్ కు పోటీగా నిలుస్తున్నాడని అర్థమవుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!