Devara: RRRతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించడం తెలిసిందే. “RRR” అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాక చాలామంది హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు… ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నారు. తన కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో.. ఎన్టీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. పైగా రాజమౌళితో చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావటంతో ఎట్టి పరిస్థితులలో రిజల్ట్ నెగటివ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్ గా నటిస్తోంది. దక్షిణాది సినిమా రంగంలో ఇదే ఆమెకు మొదటి సినిమా.
ఇంకా ఇదే సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో రెండు ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారట. ఇందుకోసం హాలీవుడ్ కెమెరాలతో పాటు అక్కడ టెక్నీషియన్ లను తీసుకురావటం జరిగిందట. కచ్చితంగా ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి హైలెట్ అవుతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒళ్ళు గగ్గుర్పొడిచే రీతిలో ఉంటాయని.. మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఆల్రెడీ ఒక యాక్షన్ షెడ్యూల్.. కంప్లీట్ అయినట్లు టాక్.
సముద్రంలో విలన్ తో జూనియర్ ఎన్టీఆర్ తలబడబోయే ఫైట్ మాదిరిగా ఆ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించినట్లు సమాచారం. మరొకటి ఈ వారంలోనే హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారట. యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొనటానికి సైఫ్ ఆల్రెడీ ముంబై నుండి హైదరాబాద్ కి రావడం కూడా జరిగిందట. ఈ సినిమా షూటింగ్ ఏడాది చివరిలోపు కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ డబల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఒకటి తెగ ప్రజలకు నాయకుడిగా మరొకటి.. రివేంజ్ తీర్చుకునే కొడుకుగా… ఈ రకంగా ఎన్టీఆర్ పాత్రని “దేవర” సినిమాలో కొరటాల రాసినట్లు సమాచారం.