దసరా పండుగ సందర్భంగా బిగ్బాస్ ఇంట్లోకి ఇద్దరు సెలబ్రిటీలు అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే అక్కినేని సమంత వేదికపైన వారాంతం షూటింగ్ మొదలుపెట్టేసింది. రేపటి ఎపిసోడ్ లో ఆమె అటు కంటెస్టెంట్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా అలరిస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆర్ఎక్స్100 చిత్రంతో ప్రేక్షకుల దగ్గర మంచి ఆదరణ పొందిన కార్తికేయ పాయల్ రాజ్ పుత్ ఆదివారం ఇంట్లో సందడి చేయనున్నారు.
ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత హీరోగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు కార్తికేయ. ఈ మధ్య సినిమా అవార్డులు ఫంక్షన్ లు, ప్రత్యేక వేడుకల వేదికపై డాన్సులతో అలరిస్తూ ఉన్నాడు. ఈసారి తన ప్రతిభను చాటుకునేందుకు బిగ్ బాస్ ను వేదికగా చేసుకోనున్నాడు. అతనికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పది రోజుల క్రితమే నిర్వాహకులు అతనిని దసరా రోజు పాల్గొనవలసిందిగా కోరడం గమనార్హం. శనివారం జరగబోయే ఎపిసోడ్ కార్తికేయ వేదికపైకి ఎనిమిది నిమిషాల పాటు వేదికపై డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత కంటెస్టెంట్ లతో ముచ్చటించి నిష్క్రమిస్తాడట. ఇక అదే సినిమాలో హీరోయిన్ అయిన పాయల్ కూడా సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ వేదికపై ఈ పంజాబీ బ్యూటీ తన గ్లామర్ తో అందరిని అలరించేందుకు రెడీ అయిపోయిందట. ఇక వారం దసరా పండుగ నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వారం ఇలాగే కానిచ్చి 8 వ వారం ఎలిమినేషన్ పెడతారేమో అని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!