Shah Rukh Khan Allu Arjun: ఒకప్పుడు దక్షిణాది చలనచిత్ర రంగాన్ని తక్కువగా చూసే బాలీవుడ్ ఇప్పుడు అదే దక్షిణాది టాలెంట్ నమ్ముకుంటుంది. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన “బాహుబలి” పుణ్యమా.. భారతీయ చలనచిత్ర రంగం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూ ఉంది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు రాజమౌళి ఇంకా తెలుగు సినిమాలు గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకులు తీస్తున్న సినిమాలు ఏవి కూడా దక్షిణాది సినిమాలకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది దర్శకులతో పనిచేస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ రకంగానే తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” సినిమాతో మంచి విజయం అందుకోవడం జరిగింది.
ఈ సినిమా షారుఖ్ ఖాన్ కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. జవాన్ సినిమా విజయం సాధించడం పట్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్ రాజమౌళి షారుక్ విజయం సాధించడం పట్ల అభినందించారు. ఈ క్రమంలో వారికి షారుక్ రిప్లై ఇవ్వడంతో.. ఇద్దరు ఎంత మంచి స్నేహితులు అన్నది మరోసారి రుజువయింది. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జవాన్ సినిమాపై ప్రశంసలు కురిపించడం జరిగింది. మీ కెరియర్ లో ఇది అత్యుత్తమ చిత్రం. మీ స్టైల్ తో భారతదేశం మొత్తాన్ని ఉరవతలికించారు. మిమ్మల్ని ఎలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇకనుండి ఇలాగే చూడాలనుకుంటున్నాను. ఇక విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. దీనికి తోడు నయనతార.. తన అందంతో ఎంతగానో సినిమాకి ప్లస్ అయింది. అనిరుద్ తన సంగీతంతో మైమరిపించారు. డైరెక్టర్ అట్లీ కమర్షియల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ నీ షేక్ చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నామని జవాన్ సినిమా విజయం సాధించడం పట్ల అల్లు అర్జున్ పెద్ద పోస్ట్ పెట్టారు.
దీనికి షారుక్ ఊహించని రిప్లై ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. మీరు నాపై చూపించిన ప్రేమకు ఎంతో సంతోషం. మీ ట్వీట్ తో జవాన్ విజయాన్ని రెండోసారి ఆస్వాదిస్తున్న. మీరు నటించిన పుష్పా సినిమా అని మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీలైనంత త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి నా ప్రేమను తెలియజేస్తున్నాను. లవ్ యు..అని షారుక్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో త్వరలో బన్నీతో కలవడానికి సిద్ధమవుతున్నట్లు షారుక్ కామెంట్.. పెట్టడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే ఈ ఇద్దరు కలుస్తున్న క్రమంలో బన్నీ తండ్రి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ “RRR” తరహాలో మల్టీస్టారర్ సినిమా.. ప్రాజెక్టు చేయటానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ గతంలో అల్లు అరవింద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అమీర్ ఖాన్ తో “గజినీ” సినిమా చేసి తనకంటూ గుర్తింపు సంపాదించారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకా షారుక్ ఖాన్ లతో కలిసి మల్టీస్టారర్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు ఇండియా మొత్తంలో ఇది.. బిగ్ టాపిక్ గా నడుస్తున్నట్లు టాక్. ఈ కథను వినటానికి స్వయంగా షారుక్ అల్లు అర్జున్ దగ్గరికి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.