Pawan Kalyan: `వకీల్ సాబ్`తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చి.. `భీమ్లా నాయక్`తో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `హరి హర వీరమల్లు` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది. ఆ తర్వాత కరోనా అదుపులోకి వచ్చినా.. పవన్ భీమ్లా నాయక్‌పై ఫోకస్ చేశాడు. దీంతో హరి హర వీరమల్లు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు మళ్లీ ఈ మూవీ షూటింగ్ రీ స్టార్ట్ అయింది.
ఇప్పటికే యాబై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. మిగిలిన పార్ట్‌ను కూడా త్వరత్వరగా పూర్తి చేసుకుంటోంది. అయితే తాజాగా పవన్ కల్యాణ్ పై చిత్రీకరించిన ప్రీ షూట్ సెషన్ వీడియోను `హరిహరి వీరమల్లు వారియర్స్ వే` పేరుతో మేకర్స్ బయటకు వదిలి ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాదులో వేసిన భారీ సెట్టింగుల నడుమ పవన్ కల్యాణ్ పై గత కొన్నిరోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అయితే ఆయా సన్నివేశాల కోసం పవన్ ఏ విధంగా ప్రాక్టీస్ చేశారన్నది ఈ ప్రీ షూట్ వీడియోలో చూపించారు. దీనిని చూసి అభిమానులే కాదు సినీ ప్రియులు సైతం వావ్ అంటున్నారు. ఈ వీడియోలో బల్లెం పట్టుకుని పవన్ చేసిన విన్యాసాలు విశేషంగా అలరిస్తున్నారు. కాగా, ఈ భారీ బడ్జెట్ మూవీలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా చేస్తుండగా.. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.